PPM: కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వైసీపీ కుట్రలు పన్నుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి ఆరోపించారు. గురువారం సాలూరులో ఆమె మాట్లాడుతూ.. గత వైసీపీ హయంలోనే కల్తీ మద్యం ఏరులై పారిందని, కల్తీ మద్యం తయారీ, అమ్మకాలపై సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్యంలో కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు.