ప్రకాశం: ఒంగోలు నగరంలోని హోటల్స్, లాడ్జిలును ఇవాళ పోలీసు సిబ్బందితోపాటు స్పెషల్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రతీ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, వ్యక్తుల వివారాలను తెలుసుకున్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించి వారి వేలిముద్రలను తనిఖీ చేశారు.