NZB: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆలూర్ మండలం డీకంపల్లి గ్రామంలో గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.