VZM: కొత్తవలస మండలం చీడివలస గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఫ్రీ మాన్సూన్ డ్రై షోయింగ్, బహుళ పంటలు, కిచెన్ గార్డెన్ ప్రాముఖ్యత వివిధ రకాల పంటల రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏపిసిఎన్ఎఫ్ సిబ్బంది, వైరా వ్యవసాయ కళాశాల విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.