నిజామాబాద్ నగరంలోని స్వర్ణకారులకు హాల్ మార్కింగ్ ఆభరణాల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని విశ్వబ్రాహ్మణ నగర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు సదానంద కోరారు. నగరంలోని మర్వాడిగల్లిలో గల ధర్మకాంట కాంప్లెక్స్‌లో గురువారం, శుక్రవారం శిక్షణ ఉంటుందన్నారు. స్వర్ణకారులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.