NGKL: పదర మండలంలోని మదిమడుగు గ్రామంలో గురువారం కురిసిన భారీ వర్షం కారణంగా జనజీవనం ఇబ్బందికరంగా మారింది. గ్రామంలోని ప్రసిద్ధ ఆంజనేయస్వామి దేవాలయం పరిసరాల్లో నీరు చేరి, ప్రాంగణం మొత్తం బురదమయమైంది. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాదచారులు, ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు.