ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో కూడా టీమిండియా ఓటమిని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 264/9 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఆసీస్ బ్యాటర్లు షార్ట్ (74), కొన్నోల్లీ (61), ఓవెన్ (36) రాణించారు. దీంతో 3.4 ఓవర్లు మిగిలి ఉండగానే 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఆసీస్ కైవసం చేసుకుంది.