MBNR: నవంబర్ 2వ తేదీన జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో నిర్వహించబోయే సదర్ వేడుకలకు సంబంధించిన ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సదర్ వేడుకలను ఘనంగా నిర్వహించుకుందామని ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు చందు యాదవ్ నరసింహులు యాదవ్ పాల్గొన్నారు.