WGL: పర్వతగిరి మండలం దౌలత్నగర్ గ్రామంలోని గ్రామకంఠ భూమి వివాదంపై స్థానిక ఎస్సై బి. ప్రవీణ్ గురువారం పోలీస్ స్టేషన్లో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. మూడు ఎకరాలు ఏడు గంటల భూమి చట్టపరంగా చిదురాల వేణుగోపాల్ కుటుంబానికి చెందినదని, కోర్టు తీర్పు ప్రకారం కొనుగోలుదారులు హక్కులు కలిగి ఉన్నారని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.