ఏపీ, తెలంగాణ ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. 2020-21 లెక్కల ప్రకారం ఏపీ 43.7 శాతం మంది, తెలంగాణలో 37.2 శాతం మంది అప్పులపై ఆధారపడినట్లు నివేదిక తెలిపింది. దేశంలో తొలి రెండు స్థానాల్లో ఏపీ, తెలంగాణ నిలిచాయి. అయితే అప్పుల భారం పెద్ద కుటుంబాలపై తక్కువగా.. చిన్న కుటుంబాలపై అధికంగా ఉన్నట్లు గణాంకాలు తేల్చాయి.