GNTR: తెనాలి త్రీ టౌన్ పోలీసులు సీఐ సాంబశివరావు ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల కోసం సోదాలు చేసి, గదులు కేటాయించేటప్పుడు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం చెంచుపేటలో వాహనాల తనిఖీ కూడా చేపట్టారు.