KMM: ఆర్థిక సమస్యలతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం మధిర పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎస్సీ కాలనీకి చెందిన కోట అర్చన అనే యువతి ఆర్థిక సమస్యల కారణంగా పురుగుల మందు తాగింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.