KNR: జీఎస్టీ తగ్గింపు రైతులకు వరంగా మారిందని ధర తగ్గి రైతులకు మేలు కలుగుతుందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ చొప్పదండి రూరల్ శాఖ అధ్యక్షులు మొగిలి మహేష్ ఆధ్వర్యంలో జీఎస్టీ సంబరాల మాసోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ట్రాక్టర్ షోరూమ్‌ను బీజెపి నాయకులు సందర్శించారు.