KMM: జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వర్యాన ఈనెల 26న ఉమ్మడి జిల్లా స్థాయి అండర్-14, 17 క్రీడా జట్లను ఎంపిక చేయనున్నట్లు కార్యదర్శి వై,రామారావు తెలిపారు. లాన్ టెన్నిస్, స్కేటింగ్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్, జూడోలో బాలబాలికల ఎంపిక పోటీలు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతాయని, క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.