GDWL: అలంపూర్ జోగులాంబ ఆలయంలో 1 మిలియన్ అమెరికన్ డాలర్ దర్శనమిచ్చింది. గురువారం ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపు చేశారు. అందులో 1 మిలియన్ డాలర్ కనిపించడంతో సిబ్బంది అవాక్కయ్యారు. దాన్ని పరిశీలించిన బ్యాంక్ అధికారులు దాని విలువ ఇండియన్ కరెన్సీలో రూ. 87 లక్షలు ఉంటుందన్నారు. అయితే అది ఒరిజనల్ లేదా డూప్లికేట్ అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.