KRNL: పత్తికొండ మండలం పెద్దహుల్తిలో వెలసిన హుల్తిలింగేశ్వర, కారుమంచేశ్వర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ గంగపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారికి పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. బీరప్ప డోలు ప్రదర్శన, గురవయ్యల నృత్యాలు భక్తులను ఎంతగానో అలరించాయి.