ప్రకాశం: ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కృష్ణారావు అన్నారు. ఇవాళ పెద్ద చెర్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక కేజీబీవీ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్పెషల్ ఆధార్ క్యాంపును ఎంపీడీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ప్రజలు ఆధార్ సెంటర్లో సందర్శించి తమ పేర్లు మార్పు కానీ, అడ్రస్ మార్పు తదితర సేవలు వినియోగించుకోవాలన్నారు.