పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డా. వీ. వాణిశ్రీ ఆధ్వర్యంలో పీసీపీఎన్డీటీ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 32 స్కానింగ్ కేంద్రాలు ఉండగా, ప్రతినెల 10 కేంద్రాలు తనిఖీ చేస్తామని తెలిపారు. లింగ నిర్ధారణ చేయడం నేరం అని, నేరానికి రూ. 10,000 జరిమానా, 3 సంవత్సరాల జైలుశిక్ష ఉంటుందని చెప్పారు. రెన్యువల్ దరఖాస్తులు పరిశీలించారు.