JN: పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి పనుల పై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పంచాయ తీరాజ్ శాఖ ఉన్నత అధి కారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రహదారుల నిర్మాణాలు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, గ్రామాలలో డ్రైనేజ్ సమస్యల గురించి చర్చించారు. పనులు పెండింగ్ లేకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు అయ్యేలా కృషి చేయాలని కోరారు.