కోనసీమ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిసారు. కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ఆయనను కోరారు. రావులపాలెం జాతీయ రహదారి నుంచి వాడపల్లి వరకు ఏటిగట్టు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. వాడపల్లి వెంకన్న ఆలయాన్ని దర్శించాలని కోరారు.