SKLM: గంజాయి విక్రయ ముఠాపై మెరుపు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ కే. శ్రీనివాసరావు గురువారం మీడియాకు వెల్లడించారు. కోటబొమ్మాళి మండలం వాండ్రాడ పంచాయతీ నర్సింగపల్లి–తిలారు రోడ్డులో జరుగుతున్న అక్రమ గంజాయి విక్రయాన్ని అడ్డుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని సుమారు 5 కేజీల గంజాయి, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.