GNTR: ఆంధ్రప్రదేశ్‌ను కళాకారుల పుట్టినిల్లుగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అభివర్ణించారు. గురువారం జరిగిన నూతన కల్చరల్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కళల ప్రోత్సాహంలో సీఎం చంద్రబాబు ముందుంటారని, కళాకారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా సురేశ్ ఎన్నుకున్నారు.