CTR: కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండలంలో వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణానికి గురువారం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో నూతన ఆలయ నిర్మాణానికి 3.4 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు తెలిపారు.