WNP: కార్తీక మాసం సందర్భంగా అరుణాచల గిరి యాత్ర కోసం వనపర్తి ఆర్టీసీ డిపో నుంచి నవంబర్ 3న రాత్రి 8 గంటలకు లగ్జరీ బస్సు బయలుదేరుతుందని డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ఈ బస్సు 4న కాణిపాకం,గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం 5న అరుణాచల గిరికి చేరుతుంది.పెద్దలకు రూ.3600,పిల్లలకు రూ.2400 చార్జీ నిర్ణయించారు. బుకింగ్ కోసం 7382829379ను సంప్రదించవచ్చన్నారు.