TPT: SVU నూతన VC నర్సింగరావును గురువారం BC విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు నారాయణ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. యూనివర్సిటీలో విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. పరీక్షల ఫలితాలను త్వరితగతిన విడుదల చేసేలా, ఉపాధి అవకాశాలు కల్పించే నూతన కోర్సులను ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.