SRCL: జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతులకు అందించిన వరి వంగడాలపై వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు గురువారం పరిశీలించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాణ్యమైన విత్తనం, రైతులకు నేస్తం అనే నినాదంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామములో ముగ్గురు రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ శాఖ ద్వారా పంపిణీ చేశామన్నారు.