KNR: గన్నేరువరంలో గురువారం ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల కోసం పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై నరేందర్ రెడ్డి విద్యార్థులకు చట్టాలు, నేరాలు, శిక్షలు, పోలీస్ స్టేషన్ నిర్వహణ, ఆయుధాల వినియోగంపై అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన ఉంటే నేరాలకు దూరంగా ఉంటారని ఆయన తెలిపారు.