NGKL: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గురువారం అచ్చంపేట మండలం ఉమామహేశ్వర క్షేత్రంలో మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి మాలా ధారణ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. మాల ధారణ చేసే భక్తులకు జయరాం గురుస్వామి మాలలు వేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పాలక మండలి ఛైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, దేవాలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.