ATP: కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా గురువారం తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. 5,116 రుద్రాక్షలతో స్వామిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి కృపకు పాత్రులయ్యారు. వారికి అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.