BDK: సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ లో భాగంగా కీలక ఖనిజ రంగంలో కూడా ప్రవేశించాలని నిర్ణయించిన నేపథ్యంలో మరో ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి ప్రాంతంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గుర్తించి ఉత్పత్తి చేయడానికి ఒక ప్రయోగాత్మక ప్లాంటు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇవాళ హైదరాబాద్లో NFTDC తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు CMD బలరాం తెలిపారు.