VKB: జిల్లాలో మద్యం షాపుల టెండర్లకు 1,808 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ గౌడ్ తెలిపారు. చివరి రోజైన గురువారం ఎక్సైజ్ షాపుల టెండర్లకు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరించారు. ఈనెల 27న కలెక్టరేట్లో డ్రా తీస్తామని చెప్పారు.