KRNL: బస్సు ప్రమాదం ఘటనపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో ప్రస్తుతం 20 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.