NGKL: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ భారతి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల సంఖ్య, పరిష్కార స్థితి, కారణాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తదితర ఉద్యోగ సిబ్బందులు పాల్గొన్నారు.