BHNG: రామన్నపేట మండలం వెల్లంకి ZPHS విద్యార్థులు 170 మందికి, అలాగే MPPS విద్యార్థులు 160 మందికి దివిస్ లేబరేటరీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.2 లక్షల విలువ గల నోట్ బుక్స్, స్కూల్ బ్యాగులను పంపిణీ చేసింది. గురువారం దివిస్ లేబరేటరీ సీఎస్ఆర్ ఇన్ఛార్జ్ గోపి, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బ్యాగ్స్, బుక్స్ పంపిణీ చేశారు.