BDK: పాల్వంచ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గురువారం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ సహకారంతో నిధులు రాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, దంతెల బోర, జగన్నాధపురం, కేశవాపురం, బసవతార కాలనీ, సూరారం గ్రామాల్లో రూ.2 కోట్ల 30 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.