భువనగిరి: జిల్లా కలెక్టరేట్లో ప్రతి గురువారం ఉద్యోగవాణి నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల వ్యక్తిగత సమస్యలతో పాటు, ఉద్యోగ పరంగా సమస్యలు ఉంటే ఉద్యోగ వాణిలో తెలియపరచాలన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.