NLR: చేజర్ల మండలంలోని పాడేరు చెరువును గురువారం ఇరిగేషన్ ఈఈ రవికుమార్, డీఈ సురేష్, ఏఈ యాసిన్, బాలసుబ్రహ్మణ్యంలు తూము గుండా వృథాగా పోతున్న నీటిని పరిశీలించారు. నీటి వృథాను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెరువు నీటిని సంరక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామని అధికారులు పేర్కొన్నారు.