GDWL: జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ గురువారం ఇటిక్యాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్ అనిరుద్, సూపర్వైజర్, పీహెచ్సీ సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు. పీహెచ్సీలో ఓపీ సంఖ్య, డెలివరీల సంఖ్యను పెంచేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.