VZM: విశాఖలో ఈ నెల 26న జరగనున్న సహకార భారతి రాష్ట్ర సమ్మేళనంకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు సహకార భారతి ఉత్తరాంధ్ర సమన్వయకర్తలు మమ్ముల తిరుపతిరావు, అమరా సర్వదేవుళ్లు ఆహ్వానం పలికారు. గురువారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో వారు మంత్రిని కలిశారు. కార్యక్రమంలో జాగారపు ఈశ్వర ప్రసాద్, త్యాడ రామకృష్ణారావుతో తదితరులు పాల్గొన్నారు.