PPM: ప్రముఖ నటుడు డార్లింగ్ ప్రభాష్ జన్మదిన వేడుకలు పార్వతీపురంలో ఘనంగా జరిగాయి. పట్టణ ప్రభాష్ అభిమాన సంఘం నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. అభిమానుల సమక్షంలో భారీ కేకు కత్తిరించిన ఎమ్మెల్యే అందరికీ ఆప్యాయంగా తినిపించారు. అనంతరం వ్రుధ్దాశ్రమంలో వ్రధ్దులకు ఆహారం అందించారు.