MBNR: పశువులకు సకాలంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందీర బోయి అన్నారు. గురువారం మహమ్మదాబాద్ మండలం లింగంపల్లి గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. పశువులకు టీకాలు వేసేందుకు జిల్లా వ్యాప్తంగా 52 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు.