GDWL: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఇటిక్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని, ప్రజలకు నాణ్యమైన సత్వర సేవలు అందించాలన్నారు.