న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక రావల్ 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఈ జోడీ ఒక క్యాలెండర్ ఇయర్లో 5 సార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రెండో జంటగా నిలిచింది. అలాగే, మొత్తంగా 7 సార్లు వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, ఆసీస్ జోడీ క్లార్క్–కీట్లీ(10) తర్వాత స్థానంలో నిలిచారు.