TPT: భారీ వర్షాల నేపథ్యంలో అరణియార్ గేట్లపై గట్టి నిఘా ఉంచాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇరిగేషన్ అధికారులకు సూచించారు. గురువారం అరణియార్ స్పిల్ వే గేట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టులో నీటిమట్టం ప్రస్తుతం 27.8 అడుగులకు చేరిందన్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 31 అడుగులకు చేరుకోగానే నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే సూచించారు.