GNTR: లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లచెరువులో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. సుమారు 32 ఏళ్ల వయసు గల ఈ వ్యక్తిని ఈ నెల 22న ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన వారు ఎవరైనా ఉంటే లాలాపేట పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు.