జగిత్యాల పట్టణ 38వ వార్డులో రూ. 30 లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు, 37వ వార్డులో రూ. 10 లక్షలతో డ్రైన్ స్లాబ్ నిర్మాణ పనులకు MLA డాక్టర్ సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. అనంతరం పెద్దమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ ఛైర్మన్ గిరి నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.