న్యూజిలాండ్తో జరుగుతున్న చావోరేవో మ్యాచ్లో స్మృతి మంధాన సెంచరీతో రెచ్చిపోయింది. కేవలం 88 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. ఇది ఆమెకు వన్డేల్లో 14వ సెంచరీ కావడం విశేషం. అలాగే, మరో ఓపెనర్ ప్రతీక రావల్ కూడా 76 పరుగులతో బ్యాటింగ్ చేస్తుంది. ప్రస్తుతం భారత్ 31 ఓవర్లలో 191 రన్స్ చేసింది.