NRPT: చేనేత ఎక్సలెన్స్ సెంటర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట పట్టణ సమీపంలోని సింగారం మలుపు వద్ద నిర్మాణం జరుపుకుంటున్న చేనేత ఎక్సలెన్స్ సెంటర్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. నవంబర్ చివరి నాటికల్లా పనులను పూర్తి చేయాలని అన్నారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఉన్నారు.