NLG: సామాజికంగా, రాజకీయ, ఆర్థిక, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన రజకులను ఎంబీసీలుగా గుర్తించాలని రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు చెర్కు పెద్దులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాలలో గురువారం రజక వృత్తిదారుల సంఘం 25వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. వృత్తిదారుల హక్కుల కోసం సంఘం పోరాడుతుందన్నారు.