SRD: సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ఐకేపీ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఐకేపీ ఉద్యోగ సంఘం నాయకులు వెంకట్ మాట్లాడుతూ.. మంత్రి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.